ఊపిరాడని స్వేచ్ఛ
నక్షత్రాల వెలుగులో మెలిగే జీవితాలు మావి, చందమామ అందనది... సూర్యుడు జాడ తెలియని బతుకులు, దప్పిక దాహం కోసం..... దిక్కులతో పోరాటాలు.....చేసే సంచార జీవితాలు, ఇంతటి ప్రజాస్వామ్యంలో..... మా హక్కులు మాటే లేదు , మా చూపుడు వేలికి...... సిరా చుక్క హక్కేలేదు , అమ్మోరు పూనినట్టు ఆకలి కేకలు వేస్తుంటే , ఆ కేకల్లో ధ్యానం చేస్తుంది ఖద్దరు చొక్కా!! ©sameeranandtatawrites
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
