జీవితం
జీవితం, ఒక పుస్తకం అయితే, అందులో పోషించే పాత్రలెన్నో… జీవితం, ఒక రంగులరాట్నం అయితే, అందులో పలురంగుల మనుషులెందరో… జీవితం, ఒక బాటసారి అయితే, అందులో ఎదురయ్యే అడ్డంకులెన్నో… జీవితం, ఒక రాయి అయితే, ఆ రాతిని చెక్కే శిల్పకారులెందరో… జీవితం, ఒక రణరంగం అయితే, అందులో యుద్ధాలు ఎదురయ్యేవెన్నో… జీవితం, పుట్టకకు చావుకు మధ్యలో జరుగుతున్న నాటకం, దాన్ని మెచ్చే జనం కొందరు కిట్టని జనం మరికొందరు… -©ఎస్.సురేఖ
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
