P#1
బాధల మాటున గెలుపు నీవని కన్నీళ్ళ సంధ్రం దాటగా వచ్చే తీరం నీవని పోరాడి అలసిన నా హృదయానికి ఊరట నీవని నా యుద్ధానికి విజయం నీవని తలచిన నాకు నువ్వే బాధవై కన్నిటివై గుర్తుచేస్కోలేని నా గతాల పదునైన బాకులను మళ్ళీ నా గుండెల్లో పొడిచి పొడిచి నా రక్తాన్ని ఆస్వాదించే ఒక అందమైన అతి సౌందర్యమైన యక్షీనివై. నీ యుద్ధం నన్ను గెలవడం తో పూర్తవ్వలేదు అని ఎప్పటికపుడు గుర్తుచేస్తూ అనుమానం అనే ఆయుధం వాడి నన్నో అపరాధి గా నింద గా మచ్చ గా అవమానం గా మార్చేసిన నీకు ఎలా రుణపడగలను ఏమని నీ పైశాచికత్వాన్ని పొగడగలను. ఈ జన్మ నీకిచేసాక నీకు దహనబలి గా నన్ను నేను అర్పించేసుకునక. నీ అనుమానం అనే ప్రేమ లో నిత్యం కాలిపోతూ నీకు వెలుగవడం తప్ప నేనేమీ చేయగలను. బాధలో పట్టుకుని ఏడ్వడానికైన నాకున్నది నువ్వే కదా.
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
