1
## నమో వేంకటేశాయ... ## మెట్టు మెట్టుకి మొక్కుతూ ఏడు కొండలను చేరుకుంటుంటాం జోడించిన చేతులతో ఆగని ఆనంద గోవింద నామస్మరణలో దైనందిన జీవితాన్ని విస్మరించి దయామయుడి దర్శనానికై రెండు మూడు రోజులైనా అలుపెరుగని వరసలమవుతుంటుంటాం ఆ అభయ హస్తపు వీక్షణానికై వెంపర్లాడే ప్రాణం చెప్పనలవి కానిది మళ్ళీ సుమారుగా అంతటి ఆతురత స్వామి వారి లడ్డు సొంతమవడానికే ఆ ప్రతీ తీపి రేణువులో ఆపదమొక్కుల వాడిని ఆపాదించుకుంటాం ఆ పరిమళ తత్వాన్నంతా భక్తవత్సలుడి కరుణగానే పాడుకుంటుంటాం లడ్డూ దక్కిన దృశ్యాన్ని అపురూప ఘట్టంగా నెమరేసుకుంటూ తిరుపతి ప్రయాణాన దానిని సింహభాగం చేసుకుంటుంటాం శాఖోపశాఖలుగా పారించుకున్న జీవన పరిచయాలన్నింటిని బలపరుచుకునే కృత్యంలో పాప సంహరుడైన వేంకటేశ్వర ప్రసాదాన్ని పంచుకుంటూ లడ్డూ సాక్షిగానే ఐకమత్య మవుతుంటాం ఒక్క మాటలో తిరుపతి లడ్డంటే గుండ్రంగా మారి మా గుండెల్లో కొలువుండే కొండల రేడు + చక్రవర్తి 😔
Poetry Books 50% Off
Bestselling collections from top poets
